Oct 31,2023 22:46

ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ్ రామరాజు

కడప అర్బన్‌ : రబీ సాగుకు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సరిపడా సాగునీటి లభ్యత లేని కారణంగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగును ప్రోత్స హించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితుల్లో వ్యవ సాయ పంటలకు సాగునీరందించే చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్‌ వి.విజరు రామరాజు ప్రత్యేక సమా వేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డి.సి.గోవింద రెడ్డి, కడప నగర మేయర్‌ కె. సురేష్‌ బాబు, మైదు కూరు, బద్వేలు ఎమ్మెల్యేలు ఎస్‌. రఘు రామిరెడ్డి, డి. సుధా, రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పి.శివప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరుతడి పంటలపై దష్టి సారించి చిరు ధాన్యాలు మిల్లెట్స్‌ సాగును పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగులో చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు. రబీ సీజన్‌లో వరి సాగు చేయవద్దని వర్షాధార పంటలపై దష్టి సారించాలన్నారు. ముగియనున్న రానున్న రబీ సీజన్‌ (డిసెంబర్‌-మార్చి 2024)కు 8.470 టిఎంసిలు కలిపి మొత్తం 12.314 టిఎంసిల నీరు అవసరం కానుందని చెప్పారు. అయితే ప్రస్తుత మొత్తం నీటి లభ్యత 31.123 టిఎంసిలు కాగా అందులో 4.72 టిఎంసిలు డెడ్‌ స్టోరేజ్‌ పోనూ మొత్తం 24.848 టిఎం సిల నీరు మాత్రమే వినియోగానికి అందు బాటులో ఉందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దష్ట్యా రిజర్వాయర్ల నుంచి నీరు అందివ్వలేని పరిస్థితులు నెలకొ న్నాయన్నారు. కెసి కెనాల్‌ పరిధిలో, ఎస్‌ఆర్‌-1 పరిధిలో నీటి లభ్యత లేనం దున ఈ రెండు ఆయకట్టుల పరిధిలో రబీ పంటల సాగు చేయవద్దని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రిజర్వాయర్ల నుండి నీరు అందుతుందన్న ఆశలు వదిలి ఉన్న నీటి వనరును ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే వరకు జాగ్రత్తగా వాడుకోవాలని జెసి గణేష్‌ సూచి ంచారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రిజర్వాయర్‌లో తగిన నీటి నిల్వ లేనందున వచ్చే జిల్లాలో రబీ సీజన్‌లో పంటల సాగు ప్రశ్నార్థ కంగానే ఉంద న్నారు. కెసి ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌లో వరి సాగు చేయవద్దని ప్రత్యా మ్నాయ వర్షాధార పంటలను వేసుకునేలా రైతులకు అవ గాహన పెంచాలని వ్యవసాయ అధికా రులకు సూచించారు. ఎస్‌ఆర్‌బిసి, టిజిపి, వెలుగోడు, ముచ్చు మర్రి ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం పెరిగితే అక్కడి నుండి నీరు అందించవచ్చన్నారు. కనీసం 3 వారా లపాటు నీరందిస్తే ఖరీఫ్‌ చివరి దశలో ఉన్న పంటలకు అత్యవసర పరిస్థితి నుండి గట్టెక్కవచ్చని తెలిపారు. కెసి కెనాల్‌ ఆయకట్టు కింద. వరి, వర్షాధార పంటల వివరాలను తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశి ంచారు. వ్యవ సాయ విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంత రాయం, జాప్యం లేకుండా సజావుగా అందించాలని కలెక్టర్‌ విద్యుత్‌ శాఖ అధి కారులకు సూచించారు. మైల వరం ప్రాజెక్టు నుండి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ద్వారా కెసి ఆయకట్టుకు నీరు అం దించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులి వెందుల ఆర్‌డిఒలు మధు సూదన్‌, శ్రీని వాసులు, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్ట్స్‌ ఎస్‌ ఇ ఎం.మల్లి కార్జున రెడ్డి, టిజిపి ఎస్‌ఇ వెంకట రామయ్య, మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఇ కె.శ్రీని వాసులు, కెసి కెనాల్‌ ఇఇ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఎపిఎంఐపి పీడి రవీంద్రరెడ్డి, సిఎం ఎన్‌ఎఫ్‌ (ప్రకతి వ్యవసాయం) డిపిఎం రామకష్ణ, ఆత్మ పీడీ విజయకుమారి, ఎల్‌డిఎం దుర్గా ప్రసాద్‌, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానశాఖ, మత్స్యశాఖ, వ్యవసాయ సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు