కడప : ఖరీఫ్ సాగుకు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సరిపడా సాగు నీటి లభ్యత లేని కారణంగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్స హిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరే ట్‌లోని స్పందన హాలులో రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ పి. శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జెసితోపాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవ సాయ సలహాదారుదారు ఇర గంరెడ్డి తిరుపాల్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జలవ నరుల శాఖ ఎస్‌ఇ మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజ న్‌లో జిల్లా పరిధిలోని మొత్తం తొమ్మిది రిజర్వాయర్లన్నింటిలో కలిపి సాధారణ నీటి నిల్వ సామ ర్థ్యం 54.07 టిఎంసిల కంటే 45 శాతం తక్కువగా 32.740 మాత్రమే నీటి మట్టం ఉంద న్నారు. అందులో తాగునీరు, పరిశ్రమల అవసరాలకు పోను ఆయకట్టు పరిధిలోని 66,186 ఎకరాలకు ఖరీఫ్ సాగుకు 13 టిఎంసిల నీరు అవసరం అవు తుందన్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు అందుతుందన్న ఆశలు వదిలి ఉన్న నీటి వనరును ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు జాగ్రత్తగా వాడు కోవాలని జెసి సూచించారు. వ్యవసాయ శాఖ జిల్లా కమిటీ చైర్మన్ సూచనల మేరకు. కమ లాపురం చెరువుకు లింకు చానెళ్లు, హెడ్ రెగ్యులేటర్ల మరమ్మతులు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేసి నీటిని నిల్వచేసేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధి కారు లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారు దారు మాట్లాడుతూ ప్రతి ఆర్‌బి కెలో రానున్న రబీ సీజన్‌కు సంబ ంధించి రైతులకు అవసరమైన, వ్యవసాయాధికారులు ఆమో దించిన సీడ్స్, ఫెర్టిలైజర్స్ అందు బాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవ సాయ సలహా బోర్డు చైర్మన్ మాట్లాడుతూ రైతుల అభివద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన కొన సాగుతోందన్నారు. ముందస్తు చర్యలుగా ఈ క్రాపింగ్ కూడా చే యించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఎపిఎంఐపి పీడీ రవీంద్రరెడ్డి, సిఎంఎన్‌ఎఫ్ డిపి ఎం రామకష్ణ, ఆత్మ పీడీ విజయ కుమారి, డిసిఒ సుభాషిణి, ఎల్‌డిఎం దుర్గా ప్రసాద్, మైనర్ ఇరిగేషన్ అధికా రులు, పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యా నశాఖ, మత్స్యశాఖ, సహ కార, సివిల్ సప్లై, వ్యవసాయ సంబ ంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










