Sep 05,2023 23:19

 వినుకొండ: నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూర్‌ గ్రామ వాస్తవ్యులు రచయిత గోడపాటి అప్పారావు జీవిత చరిత్ర అరుణోదయం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం రాత్రి నిర్వహించినట్లు యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు అప్ప రాజు నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అప్పరాజు నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియో జకవర్గం ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్త కావిష్కరణ చేశారు. ఒక పేద ప్రైవేట్‌ మాస్టారు 1985 నుండి దాదాపు 25 సంవత్సరాలు పాటు కొండాయపాలెం, వేల్పూరు గ్రామంలో కొన్ని వందల మంది గ్రామీణ విద్యార్థుల ను తీర్చిదిద్దటం, అదేవిధంగా సామాజిక స్పహల్లో సిఐటియు రైతు సంఘాలలో సిపిఐ (ఎం) పార్టీ కార్యవర్గ సభ్యులుగా సమస్యలపై పోరాడిన విధానాలు గురించి ఈ పుస్తకంలో వివరించారు. ఈ తరం ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన పుస్తకం అని సభను ఉద్దేశించి ప్రసంగించారు. యుటిఎఫ్‌ జిల్లా నాయకులు ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ అప్పారావు మాస్టారు నిబద్ధతతో విద్యార్థులకు క్రమశిక్షణతో నిండిన విద్యను అందించారని అన్నారు. కార్యక్రమంలో వేల్పూరు గ్రామ పెద్దలు, నాయకులు, తల్లి దండ్రులు తదితరులు ప్రసంగించారు. అనంతరం వారికి అభినందనలు తెలియజేశారు. హనుమంత రెడ్డి, బంకూరి వెంకటేశ్వర్లు, జి విజరు కుమార్‌, వెంపటి రామారావు గంట ఆంజనేయులు బోడపాటి ఈశ్వరరావు, శివప్రసాద్‌, బోడపాటి వెంకటరాయుడు, జనవిజ్ఞాన వేదిక పల్నాడు కమిటీ చెండ్రపాటి చలపతిరావు తదితరులు పాల్గొని అప్పారావును ఘనంగా సత్కరించారు.