అరుదైన మూలకాలపై విస్తృత పరిశోధనలు సాగాలి
క్యాంపస్ : అరుదైన మూలకాలపై యూనివర్సిటీ స్థాయిలో విస్తత పరిశోధనలు సాగాలని చెన్నై లోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. గుణశేఖరన్ పేర్కొన్నారు. అరుదైన మూలకాలు అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వర్క్ షాప్ సెనేట్ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గుణశేఖరన్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనె, పాలు, నెయ్యి వంటి ఆహార పదార్థాల్లో నాణ్యతను పరిశీలించడానికి ఉపయోగపడే విధానం అందుబాటులో ఉందన్నారు. ఆహార పదార్థాలను గుర్తించడం అవసరమని అన్నారు. లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. చెన్నైలోని ఇచ్చియాన్ కంటెంట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అధినేత డాక్టర్ జనని మాట్లాడుతూ.. మనుషులకు వచ్చే థైరాయిడ్ ను నివారించడానికి అవసరమైన మూలకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే, వాటిని వినియోగంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత ఈ తరం శాస్త్రవేత్తలపై ఉందని గుర్తు చేశారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఓఎండి. హుస్సేన్ మాట్లాడుతూ.. మూలకాలపై చేపట్టే పరిశోధనలకు స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. వర్సిటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు మాట్లాడుతూ.. రైతాంగానికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టాలని కోరారు. ఈ సదస్సుకు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.తులసిరామకష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ వీ జే లక్ష్మణ్ 90 వ జయంతి సందర్భంగా వారికి ఆయనకు ఘన నివాళి అర్పించారు. మాజీ రెక్టార్ ప్రొఫెసర్ సీకే జయశంకర్, రేర్ ఎర్త్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ పీ రెడ్డి, వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. దేవప్రసాద్ రాజు పాల్గొన్నారు.
వర్కుషాపుపై ప్రసంగిస్తున్న ఎస్.గుణశేఖరన్










