
ప్రజాశక్తి-అనకాపల్లి
అద్భుతమైన ప్రతిభతో ఆరు నెలల చిన్నారి మంత్రి లాస్విక ఆర్య వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చోటు సాధించారు. అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన వెంకట నారాయణమూర్తి, తేజస్విని దంపతుల కుమార్తె లాస్విక ఆర్యకు ప్రస్తుతం 9 నెలలు వయస్సు. 6 నెలల వయసులో ఆమె తల్లి తేజస్విని ఇంట్లో కూరగాయలు, జంతువుల బొమ్మలు చూపించి వాటిని గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. 3 నిమిషాల 36 సెకన్లలో 11 కూరగాయల బొమ్మలను గుర్తించిన వీడియోను తీసి గత మార్చ్ నెలలో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. 24 జంతువుల బొమ్మలను గుర్తించిన మరో వీడియోను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు చిన్నారి లాస్విక ప్రతిభను మెచ్చుకొని ఈ నెల 12, 13 తేదీలలో బంగారు పతకం, ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతర్జాతీయ స్థాయి గల రెండు సంస్థల బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తూ వారి యూట్యూబ్, ఇన్‌ట్రాగ్రామ్, పేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలలో వీడియోను పోస్ట్ చేశారు.