Oct 06,2022 23:37

మాట్లాడుతున్న సర్పంచ్‌ త్రినాథ్‌


ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,15 ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా లాక్కుని వేరే పథకాలపై నిధులను దారి మళ్లించడం సరికాదన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాలలో కనీసం తాగునీటి సౌకర్యం, రోడ్డు నిర్మాణాలు చేపట్టలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. డ్రైనేజీలు, అంగన్వాడి భవన నిర్మాణాలు, గ్రామ అభివృద్ధికి నిధులను తక్షణమే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ గ్రామాలలో రైతులకు సిల్వర్‌, కాఫీ, జీడి మామిడి, కొబ్బరి, అరటి తదితర ఉద్యాన పంట మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని కోరారు. అనంతరం శాఖల వారీగగా సమీక్ష నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బకాయిల వేతనాలు, డ్వాక్రా రుణాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పథకాలపై సమీక్ష నిర్వహించి పేదలందరికీ అందేలా బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాధురం, ఉప సర్పంచ్‌ ఏ సత్యం, వార్డ్‌ మెంబర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్లు, ఆశ వర్కర్లు, పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.