Aug 02,2023 23:08

కేంద్రమంత్రికి ఫిర్యాదు అందజేస్తున్న ఎంపీ

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: గ్రామ పంచాయతీలకు చెల్లిస్తున్న ఆర్థిక సంఘం నిధులను బ్యాంకు ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌కు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లకీë ముత్యాలరావు, జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, టిడిపి రాజ్యసభ సభ్యులు కె.రవీంద్రకుమార్‌ ఆధ్వర్యాన ఢిల్లీలో కేంద్రమంత్రిని బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని, గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్‌లకు విలువ లేకుండా చేస్తోందన్నారు. అనంతరం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు.