ప్రజాశక్తి - కర్లపాలెం
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయడమే వైఎస్ఆర్ క్రాంతిపథం లక్ష్యమని ఎపిఎం శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ క్రాంతి పథం క్రింద వైస్సార్ పెన్షన్ కానుక, ఎస్‌హెచ్‌జి బ్యాంక్ లింకేజీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నవడ్డి, జగనన్నతోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, స్త్రీనిధి, వైఎస్ఆర్ ఉన్నతి వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సకాలంలో ఆర్థిక సహాయం చేయాలన్నారు. తరచుగా గ్రామ సంఘాల సమావేశం జరగాలన్నారు. పుస్తకాల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. బ్యాంకులు ఇచ్చే రుణాల విషయంలో, రుణాలు చెల్లించే విషయంలో గ్రూప్ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంతి పథం బాపట్ల ఏరియా కో ఆర్డినేటర్, డిపిఎం సుబ్బారావు, సిసిలు పాల్గొన్నారు.










