Dec 29,2022 18:25

ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -నెల్లూరు :నగరంలోని స్టోన్‌హౌస్‌పేట కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న తోట పావని అనే విద్యార్థిని కి రెండు కిడ్నీలు పనిచేయక తీవ్ర అనారోగ్యం ఇబ్బందిపడుతోంది. సదరు విద్యార్థినికి వైద్య ఖర్చుల నిమిత్తం కష్ణచైతన్య విద్యాసంస్థలు తరుపున రూ. 3.5 లక్షలు కళాశాల డైరెక్టర్లు శ్రీ ఆర్‌.వి.కష్ణా రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అందజేయనున్నారు. కార్యక్రమంలో జూనియర్‌ కాలేజ్‌ డీన్‌ శిరీష్‌ బాబు గారు,అకడమిక్‌ డీన్‌ రాంగోపాల్‌ రెడ్డి గారు,డిగ్రీ కాలేజ్‌ డీన్‌ సుధారాణి గారు,డిగ్రీకాలేజ్‌ ప్రిన్సిపాల్‌ నాగయ్య గారు..కళాశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.