Nov 08,2023 00:29

విఠంరాజుపల్లి నుండి నిర్వహిస్తున ర్యాలీలో పాల్గొన్న ఎంపిలు, ఎమ్మెల్యే తదితురులు

వినుకొండ: ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని, రాష్ట్రంలో సామాజిక సాధికారత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సొంతమని వైసిపి మంత్రులు నేతలు అన్నారు. సామాజిక సాధికారత బస్సు యాత్ర మంగళవారం వినుకొండలో జరిగింది. విటంరాజుపల్లి గ్రామం నుండి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మె ల్సీలు, వైసిపి నేతలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కారంపూడి రోడ్డు లోని ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ప్రసంగించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ పదవుల్లో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని, జగన్మోహన్‌ రెడ్డి సామాజిక న్యాయ పాటించడం వలన వార్డు మెంబర్‌ నుండి రాజ్యసభ ఎంపీ వరకు అవకాశాలు వచ్చాయని అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్‌ తెచ్చు కున్నారని, కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడాన్ని ఎద్దేవా చేశారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబునాయుడు దళితులను అవమానిస్తే జగన్‌ మాత్రం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడని తెలిపారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్‌ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారన్నారు. దళిత హక్కులను చంద్రబాబు కాలా రాశారని, ఎంపి శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నవంబర్‌ 17వ తేదీన మాచర్లలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదగా ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సినీ నటుడు, ఎలక్ట్రానిక్‌ మీడియా చైర్మన్‌ ఆలీ మాట్లాడుతూ బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపిం చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, పిన్నెల్లి రామకష్ణారెడ్డి, వినుకొండ నియోజకవర్గ వైసిపి నాయకులు పాల్గొన్నారు.


సామాజిక సాధికారికతను అమలు చేసిన ఘనత సీఎందే:  మంత్రి మేరుగ నాగార్జున
రాష్ట్రంలో అణగారిన వర్గాల అభ్యు న్నతి లక్ష్యంగా సామాజిక సాధికారికత ను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం వినుకొండ మండల పరిది óలోని విఠంరాజుపల్లికి చేరిన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు పాత్రి కేయుల సమావేశం నిర్వ హించారు.