Mar 07,2023 23:52

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి -అనకాపల్లి
దేశంలో ఏ ప్రాంతమైన ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం గత ఏడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకులు సాధించిన లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలలకు తగిన రుణాలను ఇచ్చి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం, బ్యాంకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పట్ల ఉద్యోగులు, మహిళలు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వెనుకబడ్డ ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి నిపుణులతో అధ్యయనం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ బ్యాంకు జిల్లా అధికార ప్రతినిధి పూర్ణిమ, నాబార్డ్‌ జిల్లా అధికారి శ్రీనివాసులు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యనారాయణ, యుబిఐడిఆర్‌హెచ్‌ జిల్లా అధికారులు పాల్గొన్నారు.