Aug 08,2023 19:26

ప్రజాశక్తి - ముసునూరు
    మండల సమాఖ్య ఆర్థిక నిర్వహణ సమావేశం మండల సమాఖ్య ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా కోఆర్డినేటర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ ఆవశ్యకత, ఫైనాన్సియల్‌ ప్రిన్సిపుల్స్‌-మండల సమాఖ్యల సుస్థిరతపై ఎపిఎం కుంటుంబాబు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఉన్న గ్రామ సంఘాల యొక్క ఆర్థిక నిర్వహణపై, మండల సమాఖ్యల ఆర్థిక నిర్వహణ, సిబిలలో ఫైనాన్సియల్‌ లిటరసి యొక్క ఆవశ్యకత, సంస్థల పనితీరు విధానము తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అకౌంటెంట్‌ నిధులు దుర్వినియోగం నివారించడానికి, విజిలెన్సు నిర్వహణ పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిసిలు, అకౌంటెంట్‌ నాగలక్ష్మి, విఎలు పాల్గొన్నారు.