
మేడికొండూరు: ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని ల్యాంప్ సంస్థ డైరె క్టర్ కొండపల్లి సాల్మన్ పాల్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మండలంలోని సిరిపురంలో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వ హిం చారు. ముఖ్యఅతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిరిపురం శాఖ మేనేజర్ మధుసూదన్‌రావు మాట్లా డుతూ బ్యాంక్ అకౌంట్లను ఎలా వినియోగించుకోవాలో, పొదుపు యొక్క ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు .డైరెక్టర్ సాల్మన్ పాల్ మాట్లాడుతూ ఏ కుటుంబంలో అయితే ఆర్థిక క్రమశిక్షణతో ఉంటారో ఆ కుటుంబాలు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తాయని సూచించారు. బ్యాంకు ద్వారా రుణాలు ఏ విధంగా పొందవచ్చు,సైబర్ నేరాలు జరగకుండా బ్యాం కు ఖాతాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటిం చాలో తెలియజేశారు. కార్యక్రమంలో ల్యాంప్ సంస్థ కోఆరి ్డనేటర్ కె.వెంకటేశ్వరరావు,షేక్ బాజీ, మంగయ్య,విప్పర్ల భాస్కర్,పిల్లి రాజు పాల్గొన్నారు.