Dec 24,2022 23:29

ఆచార్య నరసింహారావుకు ఉత్తర్వులు అందిస్తున్న రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగ ఆచార్యులు ఎ.నరసింహారావు నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ నియామక ఉత్తర్వులను నరసింహారావుకు అందజేశారు. అనంతరం ఆచార్య నరసింహారావు ప్రిన్సిపల్‌గా బాధ్యతలను చేపట్టారు. గతంలో ఆచార్య నరసింహారావు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత పాల్గొన్నారు.