Oct 21,2023 22:45

జ్యువెలరీని ప్రదర్శిస్తున్న మహిళలు


ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : నగరంలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్‌లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యూయలరీని ప్రారంభించినట్లు షోరూమ్‌ హెడ్‌ నిఖిల్‌ చంద్రన్‌ తెలిపారు. ఎం.జి.రోడ్డులోని మలబార్‌ షోరూమ్‌ నందు శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు జ్యూయలరీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. భారతీయ ప్రాచీన సంప్రదాయ ఆభరణాలతో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్టార్లెట్‌ పిల్లల ఆభరణాలు కూడా ఉంటాయన్నారు. అలాగే 22 క్యారెట్ల పాత బంగారం మార్పిడిపై జిరో శాతం తగ్గింపు ఉంటుందన్నారు. మలబార్‌ సంస్థ వ్యాపారంతొ పాలు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంనలో పలువురు కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.