అవగాహన కల్పిస్తున్న విజయకుమార్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : ఆర్‌టిసిలో ప్రయాణించే వారు నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరు కుమార్ తెలిపారు. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లకు వీటిపై బుధవారం అవగాహన కల్పించారు. టిక్కెట్ ఛార్జీలను యుపిఐ విధానంతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానూ చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ మాధవ్, రెండో డిపో మేనేజర్ శర్మ, కోర్ గ్రూప్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఒకటి, రెండు డిపోల సిస్టమ్ సూపర్‌వైజర్లు ఇబ్రహీం, హైమావతి, ఓపిఆర్‌ఎస్ ఇంచార్జ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.










