ప్రజాశక్తి - ఆదోని
ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్ డిపో కార్యదర్శి అజీం ఖాన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, సీనియర్ నాయకులు మహానంద రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్.గోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్‌టిసి డిపో ముందు ప్రసాద్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్ గ్రాట్యుటీ ఇవ్వాలని, అద్దె బస్సులను ప్రభుత్వమే నడపాలని కోరారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, కార్మికులకు పనిభారం తగ్గించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టాలని కోరారు. ఆర్‌టిసి డ్రైవర్ ప్రసాద్ పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు










