
రాయచోటి : ఆర్‌టిసి ప్రయాణమే సురక్షితమని జిల్లా ప్రజా రవాణా జిల్లా అధికారి పి.రాము పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో డిపోసులు, బస్సుల వివరాలు, అదనపు బస్సుల మంజూరు, ఆర్‌టిసి బస్సులో ప్రయాణం సురక్షితం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అలాగే ఆర్‌టసి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తోందో.. ఆర్‌టిసిని ఎలా లాభాల బాటలో నడిపించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో డిపోలు, బస్సు ల వివరాలు తెలపండి?
అన్నమయ్య జిల్లా పరిధిలో ఐదు డిపోలు మన పరిధిలోకి వస్తాయి. మదనపల్లె -1,2, పీలేరు, రాజంపేట, రాయచోటి డిపోలలో డిఎంలుంటారు. జిల్లాలో 509 బస్సులున్నాయి. 365 కార్పొరేషన్, 144 ఎయిర్ బస్సులు ఉన్నాయి.
జిల్లాకు ఏమైనా కొత్త బస్సులు వచ్చాయా?
మదనపల్లె డిపోలో స్టార్ లైనర్( నానేసి స్వీపర్), పీలేరు డిపోలో చెన్నై సప్తగిరి ఎక్స్‌ప్రెస్, మదనపల్లె నుంచి తిరుపతికి 12 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి.
జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు ఏర్పాటు చేశారా?
మదనపల్లె నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ,రాయచోటి నుండి బెంగళూరు, చెన్నై హైదరాబాద్ ప్రస్తుతం వెళుతున్నాయి. ఇంకా వేలూరుతోపాటు పలు ప్రాంతాలకు ఆర్‌టిసి బస్సు నడపడానికి ప్రతిపాదనలను పంపడం జరిగింది.
ప్రమాదాలు అరికట్టడానికి డ్రైవర్లకు ఏమైనా శిక్షణ ఇస్తున్నారా?
జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలను అరికట్టడం కోసం రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రైనర్‌తో గత నెలలో రెండు వారాలు డ్రైవ ర్లకు, జిల్లా డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాం. అలాగే రవా ణా శాఖ వారి ఆధ్వర్యంలో కూడా పలు అవగాహన కార్య కమాలు చేపట్టి ప్రమాదాలుపై డ్రైవర్లకు పలు సూచన సలహాలను అందజేస్తున్నాం. ప్రతి మంగళవారాలు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాం.
జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
జిల్లా కేంద్రమైన రాయచోటి ఆర్టీసీ బ స్టాండ్‌లో ప్రస్తుతం 9 ప్లాట్ పామ్‌లున్నాయి. రూ.2.50 కోట్ల నిధులతో 5 ప్లాట్ ఫామ్‌లను పెంచుతున్నాం. మరుగుదొడ్లు పనులు చేపడు తున్నాం. డ్రైవర్లు, కండక్టర్ల కోసం విశ్రాంతి రూ ములను ఏర్పాటు చేస్తున్నార. ఈ నిధులతో నూతన హంగులతో విస్తరణ పనులు పూర్తి చేశాం. ఈ నెల చివరినాటికి బస్టాండ్‌ను ప్రార ంభిస్తాం.
ఆదాయం కోసం ఎలాంటి చర్యలు చేపడు తున్నారు?
ఆర్‌టిసి ఆదాయం కోసం ప్రతి డిపోలో వారానికి ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఆర్‌టిసి బస్టాండ్ నూతన ఫ్లాట్‌ఫామ్‌పాటు కాంప్లెక్స్‌లు కూడా నిర్వహిస్తున్నాం. ఆర్‌టిసి ఆదాయాన్ని జోన్లలో నంబర్‌వన్‌గా ఉండడానికి మరింత ప్రయత్నం చేస్తున్నాం.
ప్రయాణికులకు ఎలాంటి సూచనలు, సలహాలిస్తారు?
ఈ మధ్యకాలంలో ద్విచక్ర, ఆటోలో ఎక్కువ మంది వెళ్తున్నారు. ద్విచక్ర వాహనంలో ముగ్గురు వెళ్లకూడదు .అలాగే ఆటోల్లో కూడా 4,5 మంది కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు. ద్విచక్ర వాహనదారులు 30 కిలోమీటర్లు దూరం మించి వెళ్లకూడదు. ద్విచక్ర, ఆటలో అధిక స్పీడు వెళ్లడం వల్ల అనేక ప్రమాదం జరుగుతున్నాయి. మలుపు వద్ద ,రోడ్డు దాటుతున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి. ప్రయాణానికి ఆర్‌టిసి బసే ప్రయాణికులకు సురక్షితం.జిల్లా ప్రజా రవాణా అధికారి పి.రాము