Oct 18,2022 23:48

నిరసన తెలుపుతున్న ఆర్‌టిసి కార్మికులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఆర్‌టిసి విశాఖపట్నం రీజియన్‌లో పనిచేస్తున్న కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సాయంత్రం సంస్థ రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట ఎపిపిటిడి నేషనల్‌ మజ్దూర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ నిరసన మూడు రోజులపాటు ఉంటుందని అసోసియేషన్‌ రీజినల్‌ అధ్యక్షుడు పి.శంకరరావు, డివిజనల్‌ అధ్యక్షుడు ఎంవిఆర్‌.మూర్తి, డివిజనల్‌ కార్యదర్శి పి.శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎడిసిలపై పనిభారం పెంచే విధానం విడనాడాలన్నారు. గతంలో మాదిరిగా డ్యూటీ చార్టులు రెగ్యులర్‌ సీనియారిటీ ప్రకారం వేయాలని కోరారు. కెఎంపిఎల్‌పై వేధింపులు ఆపాలన్నారు. గ్యారేజ్‌ సిబ్బందిని రోడ్‌ టెస్ట్‌ పేరిట వేధిస్తున్నారని తెలిపారు. టిమ్స్‌ వల్ల కండక్టర్స్‌ పడుతున్న ఇబ్బందులు తొలగించాలన్నారు. సిటీ లిమిట్స్‌లో టిఐసి పాయింట్‌ ఉల్లంఘించి కేసులు రాయడం, బస్సు కెపాసిటి దాటి ఉన్నప్పటికి ఎఫ్‌ఎన్‌సి. కేసులు రాయడం ఆపాలని కోరారు.