నల్ల బ్యాడ్జీలో ధరించి విధులకు హాజరవుతున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు
ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
నల్ల బ్యాడ్జీలు ధరించి 12వ రోజు విధులకు హాజరు
ప్రజాశక్తి - డోన్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, న్యాయమైన కోరికలను తీర్చాలని ఎంప్లాయిస్ యూనియన్ డోన్ డిపో సెక్రటరీ ఐవిఆర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం డోన్ డిపో నందు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 12వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డోన్ డిపో సెక్రటరీ ఐవిఆర్ రెడ్డి మాట్లాడుతూ 2022 అరియర్స్ ఇవ్వా లని, లీవ్‌ఎన్ క్యాష్‌మెంట్ ఇవ్వాలని, డిఏ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు యు. కామేశ్వరయ్య, పి. అలీసాహెబ్,నాగన్న,ఎం.శివ,ఏఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.










