
తనిఖీ చేస్తున్న డిప్యూటీ సిటిఎం
ప్రజాశక్తి-గొలుగొండ: ఏఎల్‌పురం గ్రామంలో ఆర్టీసి కాంప్లెక్స్‌ను డిప్యూటీ సిటిఎం కె.వెంకట్రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌లో ఉన్న సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కాంప్లెక్స్‌లో తాగునీరు, రెండు ప్యాన్లు, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కాంప్లెక్స్ ముందున్న ఖాళీ స్థలానికి సిసి వేయించడానికి కృషి చేస్తామన్నారు. కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న ఏడు షాపులకు టెండర్లకు పిలిచామని, వ్యాపార సముదాయాలకు కావల్సి వస్తే ఈ నెల 15వ తేదీ లోపు ఫోన్:9392156562 నెంబర్లకు సంప్రదించాలన్నారు.