Jan 27,2023 23:53

మాట్లాడుతున్న పద్మావతి

ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్‌:ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి పద్మావతి సూచించారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం సిబ్బందికి డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, డిపో పరిధిలో జరుగుతున్న యాక్సిడెంట్ల నివారణకు డ్రైవర్లు కృషి చేయాలని తెలిపారు. జీరో యాక్సిడెంట్‌ డిపోగా నర్సీపట్నం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోవిందరావు, డిపో మేనేజర్‌ ధీరజ్‌, మెకానిక్‌ ఫోర్‌ మెన్‌ ఆచారి, డ్రైవర్లు పాల్గొన్నారు.