Sep 03,2023 23:11

ఎ.విజయకుమార్‌

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : ఎపిఎస్‌ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో ఇప్పటి వరకు 13 బ్యాచ్‌లకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చామని, 14వ బ్యాచ్‌ ఈనెల రెండో వారంలో ప్రారంభం కానుందని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్‌టిసి డ్రైవింగ్‌ స్కూల్‌ డ్రైవింగ్‌ శిక్షణతోపాటు బస్సు విడిభాగాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. మెకానికల్‌ తరగతులు, యోగా, వ్యక్తిత్వ వికాసం, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. 14వ బ్యాచ్‌లో చేరదలచిన వారు నేరుగా జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇతర వివరాలకు 9963091999, 7382923293 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.