
బి.కొత్తకోట : బి.కొత్తకోట ఆర్‌టిసి డిపోను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గ పరిశీలకులు ఖలీల్‌అహ్మద్ ఇంటిలో కడపజిల్లా జోనర్ డిపిటిఒ రాముడు, ఆర్‌టిసి ఎఇ ఎన్.వెంకటరమణ, దేవాదాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. పట్టణంలోని బిసికాలనీ సమీపంలోని గంగమ్మమన్యంలో డిపోను ప్రారంభిం చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పుంగనూరు ఆర్‌టిసి డిపో మొదలైన తర్వాత బి.కొత్తకోట డిపోపై యాజమాన్యం దష్టి మళ్లిందన్నారు. శాశ్వతంగా డిపోకు భవనాన్ని కట్టడానికి స్థానిక బెంగళూరు రోడ్డులోని దేవాదాయ శాఖకు చెందిన మన్యాన్ని అద్దెకు తీసుకోవాలని 2020 జనవరిలోనే నిర్ణయించ్నిట్లు తెలిపారు. గంగమ్మ మాన్యంలోని పది ఎకరాల్లో ఉండగా అధిక భాగం నిరుపయోగంగా ఉన్నందున ఆర్‌టిసి డిపోను నడపవచ్చునని అధికార వర్గాలు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఆర్‌టిసి అధికారులు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో మాట్లాడటంతో సానుకూలంగా స్పందించి డిపో పనులు త్వరగా ప్రారంభం కావచ్చునని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి డిఎం వెంకట రమణారెడ్డి, కోటేశ్వరరావు, దేవాదాయ డిప్యూటీ కమిషనర్ కర్నూల్ గురుప్రసాద్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్, మదనపల్లి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పలమ నేరు నియోజకవర్గ పరిశీలకులు ఖలీల్‌అహ్మద్, నగర పంచాయతీ కమిషనర్ మనోహర్, తహశీల్దార్ రఫీఅహ్మద్, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సురేందర్, కొండాసిద్ధార్థ, సచివాలయం కన్వీనర్ సిఆర్ చిన్నికష్ణ పాల్గొన్నారు.