Feb 16,2023 23:59

మాట్లాడుతున్న విజయభాస్కర్‌రెడ్డి

ప్రజాశక్తి- అద్దంకి : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అద్దంకి ఆర్‌టిసి బస్టాండ్‌ను పిపిపి విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. అందులో భాంగా ఆర్‌టిసి బాపట్ల జిల్లా ప్రజా రవాణా అధికారి కె.విజయ భాస్కర్‌ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎఒ వెంకటేశ్వర్లు, అద్దంకి డిపో మేనేజర్‌ బి రామమోహన్‌రావు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం సేకరరించారు. ఈ కార్యక్రమంలో డిపో ఆవరణలో లీజు చెల్లించి అద్దెకుంటున్న షాపుల యజమానులు శివయ్య, శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వివిధ షాపుల యజ మానులు, అద్దంకి పట్టణ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపిటిఒ విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని 420 బస్‌స్టేషన్లలో 100 బస్‌స్టేషన్లను పిపిపి విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలో అద్దంకి బాపట్ల బస్‌ స్టేషన్‌ ఈ పరిధిలో ఉందన్నారు. నూతన డిజైన్‌ ప్రకారం కొత్త బస్టాండ్‌ కట్టించి బస్సులు లోపల తిరుగుటకు తాము సూచించిన స్థలాన్ని వదిలి పెట్టాల్సి ఉందన్నారు. బస్టాండ్‌ ప్రస్తుతం షాపుల నుంచి ప్రతినెలా వస్తున్న పది లక్షల ఆదాయాన్ని తమకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రకారం 33 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొంత పర్సంటేజి పెంచనున్నట్లు తెలిపారు. నియమ నిబంధనలు పేపర్‌ రూపంలో ఇవ్వాలని అద్దంకి పట్టణ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు కోరారు. అలా చేయడం విర్ధుమని అధికారులు తెలిపి మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పి సమావేశాన్ని ముగించారు.