Nov 06,2023 21:21

కార్గో కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న రాజారెడ్డి

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్‌టిసి అభివృద్ధి ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఎపిఎస్‌ఆర్‌టిసి బోర్డు సభ్యులు ఎ.రాజారెడ్డి సూచించారు. సోమవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సును ఆయన సందర్శిం చారు. కార్గో కౌంటర్‌ను పరిశీలించారు. కార్గో ఆదాయం పెంచి, సంస్థ అభివృద్ధికి దోహద పడాలని సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు, సూపర్‌వైజర్లతో సమావేశం ఏర్పాటుచేసి, కార్గో ఆదాయం పెంచుటకు సూచనలు, సలహాలు అడిగి తీసుకొన్నారు. కార్యక్రమంలో డిపిటిఒలు సిహెచ్‌.అప్పలనారాయణ, సుధాకర్‌, విజయనగరం జోన్‌ కమర్షియల్‌ అధికారి అప్పలనాయుడు, కమర్షియల్‌ ఎటిఎం హెచ్‌.దివ్య, తదితరులు పాల్గొన్నారు.