
విజయనగరం కోట: ఆర్‌టిసి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎపిఎస్‌ఆర్‌టిసి రీజియల్‌్ చైర్మన్ గదల బంగారమ్మ అన్నారు. ఆదివారం ఆమె స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో పదవీబాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జోనల్‌లోని ఆర్‌టిసి అభివృద్ధికి, ప్రయాణికుల సంక్షేమానికి శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, నెల్లిమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, డిసిఎంఎస్ వైస్‌చైర్మన్ చనుమల్ల వెంకట రమణ, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ రేగాన శ్రీనివాసరావు, ఆమెను స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపి బెల్లాన చంద్రశేఖరరావు, రాష్ట్ర గిరిజన శాఖ డైరెక్టర్ శోభా స్వాతి రాణి, ఆర్టీసీ అధికారులు అబినందించారు. అనంతరం చైర్మన్ డిపో గ్యారేజ్‌లో మొక్కలు నాటారు. అక్కడ నుంచి గ్యారేజ్‌లో ఉన్న మెకానిక్ సిస్టమ్‌పై ఆర్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎపిఎస్ ఆర్టీసీ ఇడి సిహెచ్. రవికుమార్, ఆర్‌ఎం ఎ.అప్పలరాజు, విశాఖ ఆర్‌ఎం ఎ.ఏసుదానం, డివిఎం కె.శ్రీనివాసరావు, డిప్యూటీ సిఎంఇ బి.అప్పలనాయుడు, డిప్యూటీ సిడిఎం ఎ.త్రినాధబాబు, విజయనగరం జోన్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్‌జెఎ దేవదాసన్, ఆర్‌ఐ కాసులమ్మ, విజయనగరం డిపో మేనేజర్ బాపిరాజు, తదితరులు పాల్గొన్నారు.