Jul 10,2023 21:15

అంబులెన్స్‌లో గాయపడిన ఎఇ పుష్పలత,

 ఎర్రగుంట్ల మండలంలోని ఆర్‌టిపిపిలో సోమవారం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఎల్‌టి బ్రేకర్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్‌టిపిపిలోని స్టేజ్‌-2లో ఎల్‌టి బ్రేకర్‌ ప్యానల్‌లో విద్యుత్‌ సరఫరా రివర్స్‌ కావడంతో ప్యానల్‌ ఒక్కసారిగా పేలిపోయింది.ప్రమాదం జరిగిన సమయంలో ఎలక్ట్రికల్‌ మెయిం టెనెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఎఇ పుష్పలత, కాంట్రాక్ట్‌ కార్మికుడు లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. ఎఇ పుష్పలత ముఖం, చేతి భాగానికి, లక్ష్మీనారాయణ చేతిపై గాయాలైనట్లు అక్కడున్న కార్మికులు తెలిపారు. వారిని వెంటనే స్థానిక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.