Feb 24,2023 00:29
వాహనాలు తనిఖీ చేస్తున్న ఆర్‌టిఒ ప్రసన్న లక్ష్మి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వాహనాలకు సరైన పత్రాలు లేకుండా రోడ్లపై తిప్పితే చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఆర్‌టిఒ ప్రసన్న లక్ష్మి తెలిపారు. బుధవారం భట్టిప్రోలులో చేపట్టిన వాహన తనిఖీలలో రూ.1.60 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వాహన రిజిస్ట్రేషన్లు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని తప్పనిసరిగా సరైన పత్రాలు పొందాలని సూచించారు.