Oct 29,2023 21:22

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని ఖడిస్తూ స్థానిక ఎపిఎస్‌ ఆర్‌టిసి వన్‌డిపో ఎదుట ఆదివారం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జేఏసి నేతృత్వంలో డ్రైవర్లు, కండెక్టర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ కావాలిలో కారుకు దారి ఇవ్వని లేదనే కారణంతో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. ఈ ఘటనపై స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్‌డిపో డ్రైవర్లు, కండేక్టర్లు పాల్గొన్నారు.