May 08,2023 17:17

మతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

ఆర్టీసీ బస్సు-బైకు ఢకొీని తల్లి కూతురు మృతి
ఆర్టీసీ డ్రైవర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా
ప్రజాశక్తి - బనగానపల్లె

మండలంలోని దద్దనాల (జుర్రేరు) ప్రాజెక్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని దద్దనాల ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు మోటార్‌ సైకిల్‌ను ఢకొీనడంతో లక్ష్మి (20), మానస (2), అక్కడక్కడ మృతి చెందారు. మనోహర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. మృతుల బంధువులు, పోలీసుల వివరాల మేరకు.. ప్యాపిలి మండలం అలేబాద గ్రామానికి చెందిన మనోహర్‌ అతని భార్య లక్ష్మి, కుమార్తె మానసలు అలేబాద గ్రామం నుండి మోటార్‌ సైకిల్‌పై బనగా నపల్లెకు లక్ష్మీ పుట్టింటికి వస్తుండగా మార్గ మధ్యలో దద్దనాల ప్రాజెక్టు వద్ద బనగానపల్లె నుండి ఎల్లార్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోటార్‌ సైకిల్‌ను ఢకొీనడంతో తల్లి లక్ష్మి, కూతురు మానసాలు అక్కడికక్కడే మృతి చెందారు. మనోహర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే బనగానపల్లె ఎస్సై రామిరెడ్డి పోలీసులతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ధర్నా: లక్ష్మీ, మానస మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించే సమయంలో మృతదేహాలను బనగానపల్లె పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉంచి మృతుల బంధువులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి మోటార్‌ సైకిల్‌ ఢకొీనడంతో తల్లి, కూతుర్లు ఇద్దరు మృతి చెందారని డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఎస్‌ఐలు రామిరెడ్డి, వీరాంజనేయులు మృతుల బంధువులకు నచ్చజెప్పి ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాసేపు ధర్నాతో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది.