అరటిలో మంచి పోషకాలతో బాటు ఎన్నోరోగాలకు ఉపశమనం కలిగించే దివ్య ఔషధం కూడా. అరటిలో ఆకులు, పువ్వులు, కాండం లోపల ఉండే దూట, కాయలు, పండ్లు అన్నీ ఉపయోగమే. ఇది ముసా జాతికి చెందిన మొక్క. విత్తనాలు ఉన్నప్పటికీ దుంప ద్వారానే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఒకసారి నాటిన మొక్క తొమ్మిది నెలల్లో ఫలసాయాన్ని ఇస్తుంది. అయితే ఇందులో అనేక రకాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..!
ఆపాదమస్తకం ఉపయోగపడే అరటి చెట్టు పెరట్లో ఉంటే కల్పవృక్షం ఉన్నట్లే. అయితే అరటి చెట్టు ఎనిమిది నుంచి పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇటీవల రెండు నుంచి నాలుగడుగుల ఎత్తులో పెరిగే సరికొత్త హైబ్రీడ్ మొక్కలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి కాండం (గుల్మా కాండం) చెక్క స్వభావాన్ని కలిగి ఉండవు. వీటి దుంపలు నుంచి కొత్త పిలకలు పుట్టుకొచ్చి, చెట్లుగా పెరుగుతాయి. కొన్ని డ్వార్ఫ్ జాతి అరటి మొక్కలను కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఇటీవల ఇండోర్ అరటి మొక్కలూ వస్తున్నాయి. అయితే ఇవి ఆర్నమెంటల్‌గా ఉంటాయి. ప్రధానంగా కూర అరటి, పండ్ల అరటి అనే రెండు రకాలు ఉన్నాయి. ఇటీవల వాటిలోనూ వందల రకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
కర్పూర అరటి..
ఆపాదమస్తకం ఉపయోగపడే అరటి చెట్టు పెరట్లో ఉంటే కల్పవృక్షం ఉన్నట్లే. అయితే అరటి చెట్టు ఎనిమిది నుంచి పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇటీవల రెండు నుంచి నాలుగడుగుల ఎత్తులో పెరిగే సరికొత్త హైబ్రీడ్ మొక్కలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి కాండం (గుల్మా కాండం) చెక్క స్వభావాన్ని కలిగి ఉండవు. వీటి దుంపలు నుంచి కొత్త పిలకలు పుట్టుకొచ్చి, చెట్లుగా పెరుగుతాయి. కొన్ని డ్వార్ఫ్ జాతి అరటి మొక్కలను కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఇటీవల ఇండోర్ అరటి మొక్కలూ వస్తున్నాయి. అయితే ఇవి ఆర్నమెంటల్‌గా ఉంటాయి. ప్రధానంగా కూర అరటి, పండ్ల అరటి అనే రెండు రకాలు ఉన్నాయి. ఇటీవల వాటిలోనూ వందల రకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇది దేశవాళీ రకం. గెలకి దాదాపు వందపైనే కాయలు కాస్తాయి. ఎనిమిది నుంచి పదడుగుల ఎత్తువరకూ ఈ అరటి చెట్టు పెరుగుతుంది. సహజ పద్ధతుల్లో మొక్కలు పెంచి చెట్లనుంచే గెలను ముగ్గనిస్తే పండ్లు చాలా మధురంగా ఉంటాయి. వసంత ఋతువులో పువ్వు పూసి, గెలతో కాపు మొదలవుతుంది. దీన్ని పెరట్లోనూ తోటలుగానూ పెంచుతారు.
చక్రకేళి..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎక్కువగా వాడే అరటి చక్రకేళి. మగ్గిన పండు తేనెలా ఎంతో మధురంగా ఉంటుంది. పండు తొందరగా మాగిపోతుంది. గెలకు తక్కువ కాయలు కాస్తాయి. ఈ అరటిపండ్లు ధర కాస్త ప్రియం. ఇందులో ఎర్ర చక్రకేళి, పచ్చ చక్రకేళి, పసుపు చక్రకేళి, తెల్ల చక్రకేళి వంటి రకాలున్నాయి. చెట్టు ఆరు నుంచి ఎనిమిదడుగుల పొడవులోనే కాయలు కాస్తుంది. మొక్క మొదట్లో నీళ్లు నిలువ ఉంచితే మొక్క కుళ్లిపోయి చనిపోతుంది.
అమృతపాణి..
అరటి జాతిలో మరో మధురం అమృతపాణి. దీన్ని ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. పండులో గుజ్జు భాగం పిండిలా ఉంటుంది. పండు బాగా మగ్గితేనే రుచి. గెలకు ఎక్కువ కాయలు కాస్తాయి. మొక్క నాటిన 11 నెలలు తర్వాత కాపుకాస్తుంది. వీటిని కూడా వాణిజ్యపరంగా తోటలుగా సాగు చేస్తారు.
గుసావళి..
అరటి పళ్లు సన్నగా, పొడవుగా ఉంటాయి. పండ్లు మగ్గినా తొక్క ఆకుపచ్చగానే ఉంటుంది. పండు బాగా మగ్గితే తియ్యగా ఉంటుంది. గెలకు 80 నుంచి వంద కాయలు ఉంటాయి. చెట్టు కాస్త అల్పంగా ఉంటుంది. సన్న గాలికే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వెదురు కర్రలతో మొక్క పడిపోకుండా దాపు పెడతారు. వీటిని పచ్చ అరటిపండ్లు అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో నాందేడ్ అరటి అని పిలుస్తారు. ఇందులో పసుపు పండ్లు రకం కూడా ఉన్నాయి. చెట్టు బలంగా పెరుగుతుంది. ఆకులు దట్టంగా ఉంటాయి.
కూర అరటి..
గుండ్రంగా కాకుండా కోలగా ఉండే అరటికాయలను కూర అరటి అంటారు. వీటిని బొంత అరటి అనీ పిలుస్తారు. తొక్కలోనూ, గుజ్జులోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. కూరకి ఉపయోగించడంతో పాటు బాగా మగ్గితే ఇవి కూడా తియ్యగానే ఉంటాయి. పచ్చిది వగరుగా ఉంటుంది. ఈ మొక్కకు తరచూ సమపాళ్లలో నీళ్లు అందించాలి. ఈ చెట్టు అరటాకులు బాగా పొడుగ్గా ఉంటాయి.
డ్వార్ఫ్ అరటి..
పొట్టి అరటి చెట్టు. రెండు నుంచి మూడడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. గెల అరటిపళ్లు కూడా చిన్నవిగా ఉంటాయి. ఇవి తినడాని కంటే అలంకరణకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఆర్నమెంటల్ బనానా అని పిలుస్తారు. గెల చెట్టు నుంచి తుంచకుండా ఉంచితే ఆరు నెలలు వరకూ పాడవ్వదు.
ఇండోర్ అరటి..
ఇది కూడా అలంకరణకు ఉపయోగించే మొక్కే. చాలా పొట్టిగా ఉంటుంది. ఆకులు చిన్నవిగా ఉంటాయి. మూడేళ్ల తర్వాత చిన్న అరటి గెల వేస్తుంది. ఇది తినడానికి ఏమాత్రం పనికిరాదు. ఎండ అవసరం లేకుండా ఇంటి లోపల పెరిగే ఇండోర్ మొక్క. వీటి పువ్వులను అలంకరణకు ఉపయోగిస్తారు.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506