ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని యాత్రికులు ఆదివారం పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ అడ్మిన్ జి.ఎం.ఎన్ శ్రీనివాసరావు కుటుంబసమేతంగా ఆదిత్యుని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతించారు. స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం అనివెట్టి మండపంలో శేష వస్త్రాన్ని కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆదివారం ఒక్కరోజు రూ.4.25 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.1,69,400, విరాళాల రూపంలో రూ.66,055, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1,90,000 ఆదాయం వచ్చిందని తెలిపారు.
అరసవల్లి అభివృద్ధికి రూ.లక్ష విరాళం
అరసవల్లి ఆలయ అభివృద్ధి పనులకు నగరానికి చెందిన అల్లు వెంకటేష్ తల్లిదండ్రులు అల్లు హటకేశం, గుణవతమ్మ దంపతుల జ్ఞాపకార్థం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ కష్ణమాచార్యులను కలిసి చెక్కును అందజేశారు.










