అరసాడ తోటలో తిష్టవేసి ఏనుగులు
బలిజిపేట: మండలంలోని అరసాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మామిడి, జీడితోటల్లో మంగళ వారం ఏనుగుల గుంపు ప్రవేశి ంచింది. ఈ సందర్భ ంగా గ్రామస్తులు అటువైపు పొలం పనులకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. ఏనుగులు ఉదయం అంతా ఒకే దగ్గర ఉంటాయని, సాయంత్రం అవి వెలుతురు ఉన్న ప్రదేశాలకు చేరుకుంటాయని అన్నారు. ప్రజలంతా రాత్రిపూట బయటకు రాకుండా సాయంత్రం పొలాలకు వెళ్లకుండా ఉండాలని ఎస్‌ఐ ప్రశాంత్ కుమార్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.










