ప్రజాశక్తి - ఆదోని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నాయకులు ఆరోపణలు మానుకోవాలని వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, మాజీ కౌన్సిలర్ నాగేంద్ర తెలిపారు. శనివారం ఆదోనిలోని వైసిపి కార్యాలయంలో వారు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమ కేసులంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాధనాన్ని దోపిడీ చేసి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుపాలయ్యారని తెలిపారు. దేశం కోసం పోరాటం చేసి చంద్రబాబు జైలుకు పోలేదని చెప్పారు. రెండెకరాలు ఉన్న చంద్రబాబు రూ.లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసే వారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు 98 శాతం అమలు పరిచి ప్రజాదరణ పొందారన్నారు. అది చూసి ఓర్వలేక టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని, ఎవరెన్ని విమర్శలు చేసినా 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాందాస్, తాయన్న పాల్గొన్నారు.