ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : ఆత్మకూరు పట్టణంలో ఎరుకులసాని నగర్‌లో నివసిస్తున్న ఎరుకుల కులస్తులు తాము ఎస్‌టి కులానికి చెందిన వారమని తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన విషయంలో తమ కులానికి సంబంధం లేని నకిలీ కుల అధ్యక్షులు నల్గొండ.శివకృష్ణ మరికొందరు కుల సంఘం అంటూ ఇటీవల స్థానిక అధికారులకు తమ కులంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వినతిపత్రం అందజేయడాన్ని తప్పుపడుతూ సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రాన్ని అందజేశారు. మొదట వీరు తమ ఇంటి నుండి ర్యాలీగా బయల్దేరి ఆర్‌డిఒ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయం ఎదుట తప్పుడు ఆరోపణలు ఖండిస్తూ, కుల సంఘ నకిలీ అధ్యక్షుడు శివకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గురునాథం తిరుపతయ్య, నాగులూరు చిన్నబయ్య, గురునాథం ప్రసాద్, పూజారి అశోక్, దాసరి ప్రసాద్, దేవరకొండ మల్లేశ్వరి, ఆవుల శ్రీహరి, కామాచి. అమర, నల్లబాయి.ఏలీనా, సోగా. లక్ష్మీ కళా తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సుమారు 200 మంది ఎరుకుల కులస్తులు పాల్గొన్నారు.










