Sep 22,2023 21:22

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
         ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30 నుండి ప్రారంభిస్తున్నట్లు కెఆర్‌.పురం ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ తెలిపారు. శుక్రవారం బుట్టాయగూడెం మండలం నుతిరామన్నపాలెంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష యాప్‌ సర్వే ప్రక్రియను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి ఇంటింటి సర్వే ఈనెల15వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ వైద్య సిబ్బంది చేపడతారని తెలిపారు. తొమ్మిది అంశాలకు సంబంధించిన, వైద్య పరీక్షలు, వ్యాధులు గురించి తెలుసుకు సురక్ష యాప్‌లో పొందుపరిచే ప్రక్రియను వేగంగా జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేచేస్తున్న వైద్య సిబ్బందికి సహకరించి వారికి ఉన్న వ్యాధులను తెలియజేయాలని పిఒ కోరారు.