Aug 17,2023 20:57

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను గణనీయంగా పెంచాలని కలెక్టర్‌ గిరీష తెలిపారు. గురువారం మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే నవాజ్‌ భాషతో కలిసి జిల్లా ఆస్పత్రి అభివద్ధి కమిటీ సమావే శాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు, రోజువారి ఒపి సంఖ్య, అందిస్తున్న జనరల్‌ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు, మందుల స్టాక్‌, ఆస్పత్రి మౌలిక వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలతోపాటు అత్యవసర మందులు, అవసరమైన వైద్య పరికరాల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆస్పత్రి సూపరిం టెండెంట్‌, ఆయా విభాగాల వైద్యులు, సిబ్బందితో సుధీర్ఘంగా చర్చించారు. గత హెచ్‌డిఎస్‌ సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యుడు దేవుడితో సమానమని, ఆస్పత్రికి వచ్చే రోగులకు అరుణ ఆప్యాయతతో అవసరమైన చికిత్సను అందించేందుకు వైద్యులు కషి చేయాలన్నారు. వైద్యరంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దష్టి పెట్టి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ సేవలను పెంచారని, వైద్య సేవలపై చీఫ్‌ సెక్రటరీ, వైద్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు జిల్లా ఆస్పత్రిలలో ఆరోగ్యశ్రీ కింద ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వీటన్నింటినీ దష్టిలో పెట్టుకోవాలని, ఒక నెల ముందు సాధారణ బదిలీలలో చాలామంది డాక్టర్లు ఇక్కడ నుంచి బదిలీ కావడం జరిగిందని, దానివల్ల ముఖ్యంగా గైనకాలజీ, అనస్తీసియా, ఇంకా ఇతర సేవలలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అనస్తీసియా గైనకాలజీ వైద్యులను మదనపల్లి ఆస్పత్రిలో డిప్యూటేషన్‌ పద్ధతిన విధులు నిర్వహించేలా ఒకటి రెండు రోజులలో ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఇతర వైద్యుల పోస్టులను భర్తీకి కషి చేస్తానమని, ప్రసవాలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన గైనకాలజీ డాక్టర్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తామన్నారు. గైనకాలజీ విభాగంలో అదనంగా 15 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఆశయాల సాధనకు వైద్యులు కషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారని తెలిపారు. వైద్యసిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. వైద్యానికి వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలో నమ్మకం కలిగేలా వైద్యసేవలు అందాలన్నారు. సమావేశంలో ఆర్‌డిఒ మురళి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల డిసిహెచ్‌ఎస్‌లు డాక్టర్‌ బిసికె.నాయక్‌, డాక్టర్‌ డేవిడ్‌ సుకుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలి, ఆర్‌ఎంఒ డాక్టర్‌ ప్రసాద్‌ రాజు, డిఎల్‌డిఒ లక్ష్మీపతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, తహశీల్దార్‌ మహబూబ్‌ చాంద్‌, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.