
ప్రజశక్తి - చీరాల
ఆధునిక జీవన విధానంలో పని ఒత్తిళ్ళతో ఆరోగ్యంపై దృష్టి సారించక అనారోగ్య పాలవుతున్నారని డాక్టర్ విమల అన్నారు. బాపట్ల డాక్టర్ ఎన్టిఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని కావూరివారిపాలెంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం 2వ రోజు ఆమె మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఉచిత వైద్య శిబిరంను జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అజ్మతుల కళాశాల ఫార్మసిస్ట్‌తో కలిసి నిర్వహించారు. 150మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సమతుల పోషణపై ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ డాక్టర్ విమల బీరా, డాక్టర్ బ్లేస్సి సాగర్, పిడి ఫణీంద్ర కుమార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ పి సాంబశివరావు, అసోసియేట్ డీన్ ఇంచార్జి డాక్టర్ సిహెచ్‌వివి సత్యనారాయణ, చీరాల ఆర్‌బికె చైర్మన్ కె రమణరెడ్డి పాల్గొన్నారు.