
ప్రజాశక్తి-యస్.రాయవరం:ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా నేషనల్ హెల్త్ అండ్ వెల్ నెస్ డే పురస్కరించుకొని సర్వసిద్ది పిహెచ్‌సి ఎనిమిది గ్రామ సచివాలయాల్లో ఆరోగ్యంపై అవగాహన శిబిరాలు నిర్వహించామని మెడికల్ ఆఫీసర్‌లు ఎస్.ఎస్.వి.శక్తి ప్రియ, డాక్టర్ వాసంతి తెలిపారు. ఈ సందర్భంగా మలేరియా ఇంఛార్జి నోడల్ ఆఫీసర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ఎస్.రాయవరం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభనుద్దేసించి మాట్లాడుతూ, యోగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వడదెబ్బ తగిలితే. శరీరంనకు కలిగే నష్టం, కీటక జనిత వ్యాధులయిన డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు జ్వరాలు రాకుండానూ, దోమలు వృద్ది చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిలువ వున్న పాత్రల పై తప్పనిసరిగా మూతలు ఉంచాలన్నారు.