ప్రజాశక్తి - నిజాంపట్నం
స్థానిక కమ్యునిటీ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న పసుమర్తి బేబీ కల్పన ఆరోగ్యశ్రీ పథకం నందు ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తించి ఆమెను కలెక్టర్ పి రంజిత్ బాషా మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు సేవ ఆరోగ్యమిత్ర ప్రశంసాపత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి అందజేశారు. ఇదే స్ఫూర్తితో పని చేసి ఆరోగ్యశ్రీ పథకానికి, నూతనంగా ఏర్పాటైన బాపట్ల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆరోగ్యశ్రీ సిబ్బందికి కలెక్టర్ సూచించారు.










