ఆరోగ్యమిత్ర రాజశేఖర్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్
బెలగాం: జిల్లాలో వైఎస్‌ఆర్. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల్లో జూన్ 2023 లబ్దిదారులకు ఉత్తమ సేవలందించేందుకు గాను సీతంపేట ఏరియా ఆసుపత్రి ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న కుండంగి రాజశేఖర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టరు నిశాంత్ కుమార్ ఆరోగ్య మిత్ర పురస్కారం అందజేశారు. జిల్లా కలెక్టరు కార్యాలయంలో కుండంగి రాజశేఖర్‌కు ఆరోగ్య మిత్ర పురస్కారం, ప్రశంసాపత్రంతో పాటు, రూ.5వేలు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో జెసి ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాధరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.










