Apr 06,2023 22:46

మాట్లాడుతున్న సివిల్‌ జడ్జి కె.రత్నకుమార్‌

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అవగాహన పొందే హక్కును కల్పించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్న కుమార్‌ అన్నారు. జిజిహెచ్‌లో మానసిక వైద్య విభాగం ఓపీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్క రించుకుని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.రత్న కుమార్‌ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నీటిని పొందే హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పా రు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యత కలిగి ఉన్నప్పుడే ప్రతి పౌరుడూ ఆరోగ్యాన్ని సాధించ గలుగుతాడని అన్నారు. అనంతరం రోగులకు పండ్లు అందచేశారు. కార్యక్రమంలో మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరణ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాయికిరణ్‌, మాజీ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కట్టా కాళిదాసు, జిల్లా విభిన్నవంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు.