Oct 18,2023 19:00

ప్రజాశక్తి - పాలకోడేరు
             ప్రతిఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మోగల్లు సచివాలయం-2 పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటిరాజు)తో కలిసి పివిఎల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పివిఎల్‌ మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ శిబిరంలో అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వైసిపి యూత్‌ విభాగం మండల అధ్యక్షులు పెనుమత్స వెంకటరాజు (బాబు), ఉప సర్పంచి పెనుమత్స సీతారామరాజు (సీతయ్య)లు పివిఎల్‌, ఎంపిపి చంటిరాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ చేకూరి రాజానరేంద్రకుమార్‌, సర్పంచుల ఛాంబర్‌ మండల ప్రధాన కార్యదర్శి బొల్లా శ్రీనివాస్‌, ఎసిపి మండల అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, ఎంపిటిసి సభ్యులు కాటూరి శాంతకుమారి, పెనుమత్స వెంకటలక్ష్మి, నరేష్‌, నాయకులు పంపన శ్రీను, నరసింహరాజు, నాగారం, జాలే సునీత, కోణాల ప్రకాష్‌, గోడి భూషణం, బాపిరాజు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్ర భవనం ప్రారంభం
మోగల్లు ఎస్‌సి ప్రాంతంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు ప్రారంభించారు. ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), వైసిపి యూత్‌ విభాగం మండల అధ్యక్షులు పెనుమత్స వెంకటరాజు (బాబు)లు వంట గది, స్టోర్‌ రూమ్‌లను ప్రారంభించారు. అనంతరం పివిఎల్‌ నరసింహరాజును, ఎంపిపి చంటిరాజును, కాంట్రాక్టర్‌ నరసింహరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సిడిపిఒ వాణి విజయరత్నం, సూపర్‌వైజర్‌ పార్వతి, సర్పంచి పెనుమత్స సీతారామరాజు (సీతయ్య) ఎఎంసి డైరెక్టర్‌ గుండు నాగేశ్వరరావు, మద్దుల మౌళి, మాణిక్యా లరావు, పాల రాధాకృష్ణ, శివకోడు హనుమంతరావు, నాగేశ్వరరావు, బాలయ్య, భలే చిట్టిబాబు పాల్గొన్నారు.
గణపవరం :ప్రజల ఆరోగ్య రక్షణకే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తుందని గణపవరం సర్పంచి మోర అలంకారం అన్నారు. గణపవరం జూనియర్‌ కాలేజీలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ విషయంలో ఎవరూ అశ్రద్ధ చేయవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరంలో వైద్యం పొందాలన్నారు. వైద్య శిబిరంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 13 మంది వృద్ధులకు సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి కళ్లజోళ్లు అందించారు. వైద్య శిబిరంలో 1819 మందికి వైద్య సేవలందించినట్లు గణపవరం ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపవరం పిహెచ్‌సి డాక్టర్లు పి.కిరణ్మయి, మధుర వెన్నెన్‌ హాస్పిటల్‌ తాడేపల్లిగూడెం డాక్టర్‌ చైతన్యకిరణ్‌, సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌బాబు, పంచాయతీ కార్యదర్శి డిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, ఉప సర్పంచి దండు రాము, అంగన్‌వాడీ ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.