Mar 09,2023 01:13
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌ బాబూరావు

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ అవగాహన కలిగి ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనతను నివారించవచ్చని రోటరీ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఐ బాబురావు అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హారిస్పేటలోని బాలికల వసతి గృహంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రక్తహీనత బారిన పడకుండా మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పూలదశ రామకృష్ణ, హాస్టల్‌ వార్డెన్‌ తదితరులు పాల్గొన్నారు.