ఖాజీపేట : ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశయమని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తవ్వారు పల్లె గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరంగామారిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజల ఆరోగ్య వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎపిఐఎసి డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, ఎంపిపి అబుబకర్ సిద్దిక్, సహకార సంఘం అధ్యక్షుడు పి.వి.రాఘవరెడ్డి, వైసిపి నాయకులు బిఎంబి బాష, అమరేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు, అభిమానులు, అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాపాడు ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపిపి లక్ష్ముమయ్య, ఎంపిడిఒ శ్రీధర్ నాయుడు, తహశీల్దార్ యామిని, డాక్టర్ ఓబులేసు, డాక్టర్ కావ్య మాధురి, ఎస్‌ఎస్ తేజ, ఎంపిటిసి రమాదేవి, వైసిపి నాయకులు మాధవ్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, జయ సుబ్బారెడ్డి, శ్రీను, పివి రమణారెడ్డి, రామాంజనేయుల రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణు, వైద్య సిబ్బంది రాఘవయ్య, మహాదేవ యాదవ్, భాస్కర్, రమేష్, నారాయణరెడ్డి సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సింహాద్రిపురం : పేదలకు ఆధునిక వైద్యం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లభిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి నాగలింగాచార్యులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బలపనూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ మహబూబ్ బాషా, ఇఒపిఆర్‌డి పద్మనాభరెడ్డి, సర్పంచ్ కష్ణారెడ్డి, కోవరగుంటపల్లి పిహెచ్‌సి వైద్యులు పాల్గొన్నారు. మైలవరం : మండల పరిధిలోని చిన్న కొమెర్లలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రామ సర్పంచ్ నారపరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పేద ప్రజలపై ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రామచంద్ర రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శివ గురువు రెడ్డి, జడ్‌పిటిసి మహాలక్ష్మి, ఎంపిపి సావిత్రమ్మ, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎంపిటిసిలు, వైసిపి విష్ణువర్ధన్ రెడ్డి శివ భాస్కర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి సచివాలయం పరిధిలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపిడిఒ రంతుల్లయ్య పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు జ్యోత్స్న, సాయి చరిత, పద్మావతి, నాగార్జున, స్పెషలిస్ట్ డాక్టర్లు షర్మిల, దీపక్, పిహెచ్‌సి సూపర్‌వైజర్ ఓబులేసు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










