Oct 05,2023 00:42

నకరికల్లు: ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దేచవరంలో బుధవారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 45 రోజులు పాటు జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సామాన్యులు, పేద ప్రజల అనారోగ్య సమస్యలు, అంతర్గత వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నాయ కులు రాష్ట్రం అభివృద్ధి చెందలేదని విమర్శిస్తున్నారు కానీ గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి వచ్చినా మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని అన్నారు. అనంతరం, ఆరోగ్య సురక్ష క్యాంపులో రాంబాబు రక్తపరీక్ష చేయించుకున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి, జెడ్పిటిసి హరీష్‌ యాదవ్‌, మండల ఉపాధ్యక్షుడు మేడం ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, తహశీల్దార్‌ నగేష్‌, ఎంపీడీవో బండి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్లు నాగమణి,వెంకటేశ్వర్లు, సూర్యనారా యణ ,బాలకృష్ణ, రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముప్పాళ్ల : పేద వర్గాలకు విద్యా,వైద్య రంగాలలో ఉత్తమమైన సేవలు అందించడం ద్వారా వారికి ఆర్థిక ఉపశమనం లభి స్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మండలం లోని చాగంటివారిపాలెం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మెడికల్‌ కిట్లను రోగులకు అందించారు. కార్యక్రమంలో నాయకులు ఎంజెఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, గొలమారి రామిరెడ్డి,పీలా లక్ష్మణ్‌, డిప్యూటీ తహశీల్దార్‌ లక్ష్మీ ప్రసాద్‌,ఈవోఆర్డి రూపావతి తదితరులు పాల్గొన్నారు.