Nov 07,2023 00:47

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ పునాది జగనన్న ఆరోగ్య సురక్షని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం మండలం బైరిసారంగపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించి గ్రామాల్లోకి వైద్యులను పంపించి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా భవిష్యత్‌లో ప్రతి ఒక్కరికి సత్వర సేవలు అందించే అవకాశముంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రట్టి లింగయ్య సరస్వతి, ఎంపిపి డొక్కరి దానయ్య. తహశీల్దార్‌ బి.పాపారావు, ఎంపిడిఒ వి. తిరుమలరావు, వైసిపి జిల్లా కార్యదర్శి దల్లి జానకిరావు, మండల పార్టీ అధ్యక్షులు అగ్గున సూర్యరావు, చిం తాడ గణపతి, అందాల శేషగిరి, బాడ జగన్నాయకులు పాల్గొన్నారు