
ప్రజాశక్తి - వేటపాలెం
ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదల అశోక్ బాబు అన్నారు. స్థానిక బండ్ల ఆదెమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. రూ.1.70కోట్లతో అత్యాధునిక వసతులతో వేటపాలెం హాస్పటల్ నిర్మించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దేయంగా సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రతి మండలానికి రెండు పిహెచ్‌సిలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో 14మంది సిబ్బంది, ఇద్దరు డాక్టర్లు నిరంతరం సేవలు అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక 30పడకల హాస్పిటల్, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని అన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద 1050 ఉన్న అనారోగ్యాలను 3252రోగాలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. 919 నుండి 2278 ఎంపైర్మెంట్ హాస్పిటల్స్ గా తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు పాల్గొన్నారు.