Sep 14,2023 20:42

రికార్డులను పరిశీలిస్తున్న జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి - బెలగాం : విద్యార్థుల ఆరోగ్య తనిఖీల వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతీబాయిఫూలే బిసి సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన గురువారం వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. అక్కడ విద్యారు ్థలతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకునే అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. విద్యార్థు లకు ఇటీవల చేపట్టిన హీమోగ్లోబిన్‌ రక్త పరీక్షల నమోదు వివరాలను రికార్డులో పరిశీలించి, వారికి వేస్తున్న ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వివరాలు ఆన్లైన్‌ నమోదును పరిశీలించారు. రక్త హీనత ఉన్న గుర్తించిన విద్యార్దులకు ఏ విధంగా మాత్రలు వేస్తు న్నారు, వారి పర్యవేక్షణ ఏవిధంగా ఉందని సిబ్బందిని అడిగారు. అలాగే విద్యార్థుల్లో ఎవరికైనా ఆయాసం, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం, దృష్టి సమ స్యలు, జ్వరం,చర్మ వ్యాధులు తదితర ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని ఆరా తీశారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలున్న విద్యార్థులకు ఆరోగ్య పరిశీలన చేసి తగు చికిత్స సూచనలు చేశారు. విద్యార్థులకు పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన పాఠశాల వంటగదిని పరిశీలించి, అక్కడ సిబ్బందితో మాట్లా డారు. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలని, చేతులు తరచుగా శుభ్ర పర్చుకో వాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యాల య డెమో యోగీశ్వ రరెడ్డి, హాస్టల్‌ స్టాఫ్‌ నర్స్‌ సిహెచ్‌ గౌతమి, వైద్య సిబ్బంది జయగౌడ్‌, సావిత్రి, ఉన్నారు.